![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -576 లో... మా అమ్మని పంపించండని కనకంతో రాజ్ అనగానే.. ఏదైనా ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడమను కనకం అంటూ అపర్ణ అంటుంది. అది రాజ్ వింటాడు. నీ భార్యని వదిలేసినట్లు.. నా భార్యని వదిలేయ్యలేను నా భార్యని తీసుకొని రా అని రాజ్ తో సుభాష్ అంటాడు. అలాగే మిగతా వాళ్లు కూడా రాజ్ తో అపర్ణని తీసుకొని రా అని అనగానే.. సరే అంటు రాజ్ కోపంగా వెళ్తాడు.
ఆ తర్వాత అపర్ణకి ఇందిరాదేవి ఫోన్ చేసి.. నీ ప్లాన్ సక్సెస్.. వాడు కోపంగా బయల్దేరాడని చెప్తుంది. ఇక మన నాటకం మొదలు పెడదామని కనకంకి అపర్ణ చెప్తుంది. ఇంట్లో ఏం కూరగాయలు ఉన్నాయో అన్ని తీసుకొని రా అని అపర్ణ అనగానే.. మీకెందుకు శ్రమ అని కనకం అంటుంది. ఇది మన ప్లాన్ లో భాగమేనని అపర్ణ అంటుంది. మరొకవైపు రాజ్ ఎక్కడ కావ్యని తీసుకొని వస్తాడోనని రాహుల్, రుద్రాణి ఇద్దరు టెన్షన్ పడతారు. కాసేపటికి కనకం ఇంటికి వస్తాడు రాజ్. ఎదురుగా కావ్య వస్తుంది. మా అమ్మ మీరు చెప్పినట్టు వినేలా చేసుకున్నారంటూ కావ్యపై రాజ్ విరుచుకుపడతాడు. నేనేం అత్తయ్యని రమ్మనలేదు.. మీరు అత్తయ్య వస్తే తీసుకొని వెళ్ళండి కానీ నన్ను మాత్రం ఏం అనకండని రాజ్ తో కావ్య చెప్పేసి వెళ్ళిపోతుంది.
రాజ్ వెళ్లేసరికి అపర్ణ కూరగాయలు కోస్తూ ఉంటుంది. కనకం పైన కూర్చొని అపర్ణకి పనులు చెప్తుంది. ఏంటి అమ్మ ఇలా అయ్యావ్ పదా మన ఇంటికి అని రాజ్ అనగానే.. నా కోడలు వస్తేనే వస్తానని అపర్ణ తెగేసి చెప్తుంది. దాంతో ఎలా రావో చూస్తానని రాజ్ కోపంగా వెళ్తాడు. మీరు యాక్టింగ్ చెయ్యమన్నారని చేసాను అంతే కానీ నాకు ఇష్టం లేదని కనకం అంటుంది. రాజ్ ఇంటికి వెళ్తాడు. అమ్మ రానని చెప్పిందని ఇంట్లో వాళ్లకు చెప్తాడు. తరువాయి భాగంలో ఇందిరాదేవి వంట చేస్తుంటే చెయ్ కాలుతుంది. దాంతో కావ్యకి రాజ్ ఫోన్ చేసి మా మమ్మీనీ పంపించమని అంటాడు. దాంతో అపర్ణ ఫోన్ లాక్కొని.. ఏంటి రా తనని దబాయిస్తున్నావంటూ రాజ్ పై అపర్ణ అరుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |